క్వీన్స్‌ల్యాండ్: ఐదు టి-20 సిరీస్‌లో భాగంగా ఇక్కడి కర్రారా ఓవల్ వేదికగా భారత్‌తో జరుగుతున్న నాలుగో టి-20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకూ జరిగిన మూడు మ్యాచుల్లో తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా, రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, మూడో మ్యాచ్‌లో భారత్ విజయం సాధించాయి. దీంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు సిరీస్‌ను కైవసం చేసుకొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓడిన జట్టు ఐదో మ్యాచ్ కచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టులో నాలుగు మార్పులు చేయగా.. భారత్ అదే జట్టుతో బరిలోకి దిగుతోంది. ఇక తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 2 ఓవర్లు వికెట్ నష్టపోకుండా 13 పరుగులు చేసింది. క్రీజ్‌లో గిల్ (2), అభిషేక్ (10) ఉన్నారు.