విక్రాంత్, చాందిని చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సిినిమా ‘సంతాన ప్రాప్తిరస్తు’. కామెడీ, లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీకి సంజీవ్ రెడ్డి డైరెక్టర్. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులకు నవ్వులు పూయించేలా ఉన్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ ప్రేమ జంట.. తర్వాత పిల్లల కోసం వారు ఎదుర్కొనే సమస్యల నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాలో డైరెక్టర్ తరుణ్ భాస్కర్, వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, తాగుబోతు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీత ఈ సినిమా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.