రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్‌లో తార్లగూడెం మండలంలో ఎన్‌కౌంటర్ జరిగింది. మరికెళ్ల అడవుల్లో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగి ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోలు మృతి చెందారు. తాళ్లగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నారం-మరికెళ్ల అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారని సమాచారం రావడంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. భద్రతా బలగాలు రాకను గమనించిన మావోయిస్టులు కాల్పులకు తెగపడ్డారు. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మావోలు చనిపోయారు. బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో కూడా ముగ్గురు మావోయిస్టులు చనిపోయిన విషయం విధితమే.