ఐసిసి వన్డే ప్రపంచకప్ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న భారత మహిళ క్రికెటర్లను మరో మెగా ఈవెంట్ ఆహ్వానిస్తోంది. ప్రతిష్టాత్మక ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌కు మెగా వేలం నవంబర్ 27న జరుగనుంది. ఈ నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు కొందరు ప్లేయర్లను రిటైన్ చేసుకున్నారు. ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఐదుగురిని రిటైన్ చేసుకోగా.. ముంబై ఇండియన్స్ కూడా ఐదుగురిని అట్టిపెట్టుకుంది. అందులో ప్రపంచకప్ సాధించిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా ఉంది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ స్మృతి మంధానతో పాటు మరో ముగ్గురిని రిటైన్ చేసుకుంది. ఇక గుజరాత్ జెయింట్స్ ఇద్దరిని, యూపీ వారియర్స్ కేవలం ఒకరిని మాత్రమే రిటైన్ చేసుకొని మిగితా అందరిని విడుదల చేసింది.
రిటెన్షన్ లిస్ట్
ముంబై ఇండియన్స్
నాట్ సీవర్- బ్రంట్ (రూ. 3.50 కోట్లు)
హర్మన్‌ప్రీత్ కౌర్ (రూ. 2.50 కోట్లు)
హేలీ మాథ్యూస్ (రూ. 1.75 కోట్లు)
అమన్‌జోత్ కౌర్ (రూ. 1 కోటి)
గుణాలన్ కమిలిని (రూ. 50 లక్షలు)
ఢిల్లీ క్యాపిటల్స్
షఫాలీ వర్మ (రూ. 2.20 కోట్లు)
జెమీమా రోడ్రిగ్స్ (రూ. 2.20 కోట్లు)
మరిజానే కాప్ (రూ. 2.20 కోట్లు)
అనాబెల్ సదర్లాండ్ (రూ. 2.20 కోట్లు)
నికీ ప్రసాద్ (రూ. 50 లక్షలు)
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
స్మృతి మంధాన (రూ. 3.50 కోట్లు)
రిచా ఘోష్ (రూ. 2.75 కోట్లు)
ఎలిస్ పెర్రి (రూ. 2 కోట్లు)
శ్రేయాంక పాటిల్ (రూ. 60 లక్షలు)
గుజరాత్ జెయింట్స్
ఆష్లే గార్డ్‌నర్ (రూ. 3.50 కోట్లు)
బెత్ మూనీ (రూ. 2.50 కోట్లు)
యూపీ వారియర్స్
శ్వేతా సెహ్రావత్ (రూ. 50 లక్షలు)