ప్రార్థనల కోసం వచ్చిన మహిళా భక్తులను వేధింపులకు గురిచేస్తున్న చర్చి ఫాస్టర్‌పై సనత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. గ్లోబల్ ఫెయిత్ మినిస్ట్రీస్ చర్చ్ పాస్టర్ అయిన మాసా జేడీ పాల్ కొంత కాలం నుంచి ప్రార్థనల కోసం చర్చికి వచ్చే మహిళలను వేధిస్తున్నాడు. జేడి పాల్ తండ్రి మాస యేసురత్నం 47ఏళ్ల క్రితం ఫతేనగర్‌లోని చర్చికి వచ్చే భక్తులు విరాళాలు ఇవ్వడంతో చర్చిని కట్టారు. కరోనా సమయంలో మాస యేసు రత్నం 2021 లో మృతిచెందారు. తర్వాత చర్చిని స్వాధీనం చేసుకున్న అతడి కుమారుడు మాసా జెడి పాల్ భక్తులను వేధింపులకు గురిచేస్తున్నాడు. తండ్రి బ్రతికి ఉన్నప్పుడు ఆయన పై వ్యభిచారి అని నింద వేసి, చర్చి నుంచి కొంత మందిని తీసుకొని వెళ్లిపోయి బాలానగర్ లో మాసా జెడి పాల్ మరో చర్చి నిర్వహిస్తున్నాడు.
తండ్రితో విభేదించి వెళ్లిపోయిన పాస్టర్ మాస పాల్ తండ్రి మరణం తర్వాత బలవంతంగా చర్చ్‌లోకి జొరబడి, తల్లి మాస రూతమ్మతో కలిసి అక్కడి చర్చిని తీసివేశారు. ఇది తన తండ్రి తనకు ఇచ్చిన ఆస్తి అంటూ ప్రార్థనలు జరగకుండా నానా హంగామా చేశారు. ప్రశ్నించిన వారిపై దాడి చేసి కొట్టారు, మహిళా భక్తులు అని చూడకుండా పాస్టర్ మాస పాల్ మహిళల వీడియోలు చిత్రీకరించడం, రహస్యంగా చర్చ్ లో సిసి కెమెరాలు పెట్టారు, దీంతో మహిళా భక్తులు చర్చికి రావడం మానేశారు. మాస పాల్, మాస రూతును చర్చి అమ్మకానికి పెట్టారని బాధితులు ఆరోపించారు. భక్తులను బెదిరించడం, అసభ్యంగా ప్రవర్తించడంతో బాధితులు సనత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.