దుల్కర్ సల్మాన్ నటిస్తున్న పీరియాడికల్ డ్రామా ’కాంత’ నవంబర్ 14న విడుదల కానుంది. టీజర్, పాటలు అద్భుతమైన స్పందనతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పరిచాయి. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ లాంచ్ చేసిన ట్రైలర్ ఇంటెన్స్ ఎమోషనల్ సినిమాటిక్ అనుభూతితో అదిరిపోయింది. దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ ఈ కథను భావోద్వేగాలు, హృదయాన్ని హత్తుకునే డ్రామాటిక్ సన్నివేశాలతో అద్భుతంగా చూపించారు. దుల్కర్ సల్మాన్ తన అద్భుతమైన నటనతో మైమరపించారు. దుల్కర్ సల్మాన్ ‘వేఫేర్ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్’, రానా దగ్గుబాటి ‘స్పిరిట్ మీడియా’ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. “ఇది మాకు చాలా స్పెషల్ సినిమా. నా బెస్ట్ ఫ్రెండ్ రానాతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. సెల్వ అద్భుతమైన కథతో వచ్చాడు. కుమారి పాత్రలో భాగ్యశ్రీ చాలా చక్కగా నటించింది. ఇది మంచి డ్రామా, థ్రిల్లర్” అని అన్నారు. హీరో రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. “ఇలాంటి పీరియడ్ సినిమాకి దుల్కర్ సల్మాన్ లాంటి రెట్రో కింగ్ పర్ఫెక్ట్. నవంబర్ 14 తర్వాత దుల్కర్‌ని అందరూ నటచక్రవర్తి అని పిలుస్తారు. దుల్కర్, సముద్రఖని లాంటి అద్భుత నటుల మధ్య నిల్చుంది భాగ్యశ్రీ” అని తెలిపారు.
డైరెక్టర్ సెల్వమణి సెల్వరాజ్ మాట్లాడుతూ.. “సినిమాలో నటచక్రవర్తి దుల్కర్ సల్మాన్ నటనని అందరూ చాలా ఇష్టపడతారు. రానా నటన అందరినీ సర్‌ప్రైజ్ చేస్తుంది. భాగ్యశ్రీ, సముద్రఖని అద్భుతంగా నటించారు”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగ్యశ్రీ, సముద్రఖని, ప్రశాంత్ పొట్లూరి పాల్గొన్నారు.