విష్ణు విశాల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఆర్యన్’. ప్రవీణ్ కె దర్శకత్వంలో విష్ణు విశాల్ స్టూడియోజ్, శుభ్రా, ఆర్యన్ రమేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రేష్ట్ మూవీస్ అధినేత సుధాకర్ రెడ్డి ఈ సినిమాను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే తమిళ్ లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుంది. నవంబర్ 7న తెలుగులో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో హీరో విష్ణు విశాల్ మాట్లాడుతూ “ఇలాంటి సినిమా చేయడం చాలా ఛాలెంజింగ్. తప్పకుండా ఆడియన్స్‌కి సీట్ ఎడ్జ్ అనుభూతినిస్తుంది ఈ సినిమా”అని అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్లు శ్రద్ధా శ్రీనాథ్, మానస, డైరెక్టర్ ప్రవీణ్ హరీష్ పాల్గొన్నారు.