వర్సటైల్ సింగర్ రామ్ మిరియాల ‘సంతాన ప్రాప్తిరస్తు‘ సినిమా టైటిల్ సాంగ్ పాడారు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించిన ఈ పాటను సునీల్ కశ్యప్ కంపోజ్ చేశారు. -’సంతాన ప్రాప్తిరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు…’ అంటూ సాగే ఈ పాట నేటి యువత వైవాహిక జీవితాన్ని చూపిస్తుంది. విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న ‘సంతాన ప్రాప్తిరస్తు‘ సినిమాను మధుర ఎంటర్‌టైన్‌మెంట్, నిర్వి ఆర్ట్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. ‘సంతాన ప్రాప్తిరస్తు‘ సినిమా ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా నుంచి ఇప్పటిదాకా విడుదల చేసిన లిరికల్ సాంగ్స్‌కు మంచి స్పందన వచ్చింది.