కింగ్ నాగార్జున ఆల్‌టైం కల్ట్ క్లాసిక్ ’శివ’ బాక్సాఫీసు రికార్డులుని తిరగరాస్తూ ఇండియన్ సినిమాను ’బిఫోర్ శివ’, ’ఆఫ్టర్ శివ’గా పునర్నిర్వచించింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో1989లో విడుదలైన శివ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నిర్మాతలు అక్కినేని వెంకట్, సురేంద్ర యార్లగడ్డ నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఇయర్స్ సందర్భంగా శివ చిత్రాన్ని 4కె డాల్బీ ఆట్మాస్ లో నవంబర్ 14న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ సమక్షంలో శివ రీరిలీజ్ ట్రైలర్ ని లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో కింగ్ నాగార్జున మాట్లాడుతూ “నా మిత్రుడు రామ్ గోపాల్ వర్మ 36 ఏళ్ల క్రితం నాతో శివ సినిమా తీసి నన్ను పెద్ద స్టార్ ని చేశారు. శివ 4కె డాల్బీ ఆట్మాస్ సినిమా చూశాను. అద్భుతంగా అనిపించింది. రాము దాదాపు 6 నెలలు చాలా ప్రేమతో ఇష్టపడి ప్రతి సౌండ్ ట్రాక్ ని మళ్లీ ఒరిజినల్ సినిమా చేసినట్టుగా, ఒక మైల్ స్టోన్ గా నిలబెట్టాలని చాలా అద్భుతంగా డిజైన్ చేశాడు. నవంబర్ 14న అందరూ ‘శివ’ని కొత్తగా అనుభూతి చెందుతారు”అని అన్నారు. డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ “శివ సినిమా రీ రిలీజ్ కోసం సౌండ్‌ని చాలా మెరుగ్గా డిజైన్ చేశాం. కొత్త టెక్నాలజీని ఉపయోగించాం. చిరంజీవి చెప్పినట్టు సినిమా ఉన్నంతవరకు శివ చిరంజీవిలా చిరస్మరణీయం”అని తెలిపారు.