అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా కేంద్రంలో దారుణం వెలుగులోకి వచ్చింది. విద్యార్థులపై ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ వాచ్ మెన్ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. వాచ్ మెన్ హరిగోపాల్ అర్థరాత్రి పూట తన గదికి విద్యార్థునులను పిలిపించుకొని బ్లూఫిల్మ్స్ చూపించి అఘాయిత్యాలకు పాల్పడ్డాడు. భయంతో ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలపడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వాచ్ మెన్ నీచ ప్రవర్తనను వార్డెన్ ముని శంకర్ దృష్టికి తల్లిదండ్రులు తీసుకెళ్లారు. తల్లిదండ్రులు, వార్డెన్ అలిపిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎస్సి, ఎస్టి అట్రాసిటీ, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.