అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంతో మంది పాత్ర ఉంది అని బిజెపి ఎమ్ఎల్ఎ ఆది నారాయణ రెడ్డి తెలిపారు. తాము మాజీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికు సూపర్ చెక్ పెట్టబోతున్నాం అని అన్నారు. భారత రాజ్యాంగాన్ని జగన్ అమలు చేశారని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసలు దోషులు దాక్కున్నారని, కేసును సిబిఐ కి అప్పగించాలని సూచించారు. తాము, బిటెక్ రవి, సతీష్ రెడ్డి కలిసి వివేకాను చంపామని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. లిక్కర్ కేసులో జగన్ పాత్ర ఉందని, జైలుకు వెళ్లడం ఖాయమని ఆది నారాయణ రెడ్డి హెచ్చరించారు.