మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానంపై అధ్యయనానికి ప్ర భుత్వం కమిటీ ఏర్పాటు చే సింది. ఈ మేరకు మంగళవారం సిఎస్ కె. రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. సంక్షేమశాఖ స్పెషల్ సిఎస్ ఛైర్మన్‌గా, ప్రొ ఫెసర్ కంచ ఐలయ్య, కోదండ రాం, ఆర్థి క, విద్య, ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ సంక్షేమశాఖల కార్యదర్శులు, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌తో పాటు ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెంలగాణ హయ్యర్ ఎడ్యుకేషన్(ఫతి) నుంచి ముగ్గురు ప్రతినిధులను కమిటీలో సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. ఫీజు రీ యింబర్స్‌మెంట్ పాలసీపై కమిటీ.. ప్రభుత్వానికి సూచనలు ఇవ్వనుంది. ప్రత్యేక ట్రస్ట్ ద్వారా ఫీ జు రీయింబర్స్‌మెంట్ సాధ్యాసాధ్యాలను కమిటీ పరిశీలించనుంది. 3 నెలల్లో కమిటీ నివేదిక ఇ వ్వాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. విద్యా సంస్థలు పేర్కొన్న సూచనలపై కూడా కమిటీ అధ్యయనం చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పే ర్కొంది. కాగా ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదలలో జాప్యాన్ని నిరసిస్తూ ప్రైవేట్ వృత్తి వి ద్య, డిగ్రీ కాలేజీలు చేపట్టిన బంద్ రెండో రోజు కొనసాగింది. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెం ట్ నిధులు విడుదల
చేసే వరకూ కొనసాగించనున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెంలగాణ హయ్యర్ ఎడ్యుకేషన్(ఫతి) నాయకులు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాల నిరసనలో భాగంగా ఈ నెల 8న ఎల్.బి.స్టేడియంలో మంది అధ్యాపకులు, కళాశాలల సిబ్బందితో సమావేశం నిర్వహించనున్నట్లు ఫెడరేషన్ నాయకులు తెలిపారు. అలాగే ఈ నెల 11న 10 లక్షల మంది విద్యార్థులతో హైదరాబాద్‌లో లాంగ్ మార్చ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో దాదాపు 2,500 ప్రైవేట్ విద్యాసంస్థలు ఉన్నాయని ఈ బంద్‌లో పాల్గొన్నట్లు ఫెడరేషన్ నాయకులు తెలిపారు. వీటిలో ఇంజనీరింగ్, ఫార్మసీ, లా, బి.ఎడ్, ఎంబిఎ, ఎంసిఎ, నర్సింగ్, ఇతర ప్రొఫెషనల్ కాలేజీలు ఉన్నాయని అన్నారు.
ఫార్మసీ పరీక్షలకు తక్కువగా హాజరు నమోదు
బి. ఫార్మసీ మొదటి సంవత్సరం రెండవ సెమిస్టర్ పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. అయితే ఈ పరీక్షలకు 12 శాతం మాత్రమే హాజరు నమోదైంది. జెఎన్‌టియుహెచ్ పరిధిలో 9 కాలేజీలు పరీక్షలు నిర్వహించగా, 52 కాలేజీలు పరీక్షలను బహిష్కరించినట్లు ప్రైవేట్ యాజమాన్యాలు తెలిపాయి. కాగా, కొన్ని కాలేజీలు షెడ్యూల్ ప్రకారం విద్యార్థులను పరీక్ష రాయడానికి అనుమతించలేదని తెలిసింది.
చర్చనీయాంశంగా కమిటీని ఏర్పాటు
ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదలలో జాప్యాన్ని నిరసిస్తూ ప్రైవేట్ కాలేజీలు బంద్ పాటిస్తుండగా, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి సంస్కరణలపై కమిటీని ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఒకపక్క ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. వాయిదాల రూపంలో బకాయిలు చెల్లిస్తామంటూ కాలేజీల యాజమాన్యానికి ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది. తమకు హామీ ఇచ్చిన మేరకు నిధులు విడుదల చేస్తే తమ నిరసనను విరమిస్తామని యాజామన్యాలు ప్రభుత్వానికి తేల్చిచెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యం, ప్రభుత్వానికి మధ్య దూరం పెరుగుతోంది.