రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రబొడ కాలనీలో గంజాయి గ్యాంగ్ రెచ్చిపోయింది. పార్క్ చేసిన కారు అద్దాలను గంజాయి గ్యాంగ్ ధ్వంసం చేసింది. ఈ విషయమై ప్రశ్నించిడంతో యజమానితో గంజాయి బ్యాచ్ దురుసుగా ప్రవర్తించింది. తనకు పగలగొట్టాలనిపించింది అందుకే పగలగొట్టాను అని గరుకుగా సమాధానం చెప్పి వారు వెళ్లిపోయారు. కారు మొత్తం తగలబెడతామని యాజమానిని ఉల్టా బెదిరింపులకు పాల్పడ్డారు. అడ్డు వచ్చిన వారిపై దాడులకు పాల్పడ్డారు. స్థానికులు పోలీసులకు ఫోన్ కాల్ చేసి సమాచారం ఇచ్చారు. ఫిర్యాదు చేస్తేనే వస్తామని వస్తామని ఇన్స్పెక్టర్ క్యాస్ట్రో వింత సమాధానం చెప్పారు. పోలీసుల తీరుపై ఎర్రబొడ వాసుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులు నమోదు చేయకుండా లీడర్లు సముదాయిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రబొడలో బీరప్ప గుడిమెట్లపై మందుబాబులు మద్యం సేవించి అనంతరం బీర్ బాటిల్స్ అక్కడే పడేసి వెళ్లిపోయారు. ఈ విషయంపై ఎన్ని సార్లు పిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడంలేదని స్థానికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలోను కూడా అదే ప్రాంతంలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయిన విషయం తెలిసిందే. పలువురు మహిళలతో గంజాయి బ్యాచ్ అసభ్యంగా ప్రవర్తించింది. వెకిలి సైగలతో మహిళలు ఆవేదనకు గురవుతున్నారు. పోలీసులకు సమాచారం అందించినప్పటికీ ఘటన స్థలానికి చేరుకోలేదని వాపోయారు.