మహిళల వన్డే ప్రపంచకప్ ట్రోఫీని సాధించిన భారత క్రికెట్ జట్టు బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని మర్యాద పూర్వకంగా కలిసింది. ఢిల్లీలోని తన నివాసంలో ప్రధాని మోడీ టీమిండియా సభ్యులకు ఆతిథ్యం ఇచ్చారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో కలిసి జట్టు సభ్యులు ప్రధానీతో భేటి అయ్యారు. ఈ క్రమంలో క్రికెటర్లు వరల్డ్‌కప్ విశేషాలను ప్రధానితో పంచుకున్నారు. విశ్వ విజేతగా నిలిచిన భారత జట్టుకు ప్రధాని అభినందనలు తెలిపారు.
కాగా, 47ఏళ్ల నిరీక్షణకు తెర దించుతూ తొలిసారి భారత జట్టు వన్డే ప్రపంచకప్ సాధించింది. నవీ ముంబై వేదిగా దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన ఫైనల్ లో భారత్ 52 పరుగుల తేడాతో చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. దీంతో దేశం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. టీమిండియాపై అందరూ ప్రశంసల వర్షం కురిపించారు. వన్డే ప్రపంచకప్ గెలిచిన 4వ జట్టుగా భారత్ నిలిచింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా ఏడు సార్లు, ఇంగ్లండ్ నాలుగు సార్లు, న్యూజిలాండ్ ఒక్కసారి ప్రపంచకప్ ను గెలుచుకున్నాయి.