ఢాకా : ఇస్లాం మత ప్రచారకుడు, భారత్ వాంటెడ్ జాకీర్ నాయక్ కు బంగ్లాదేశ్ గట్టి షాక్ ఇచ్చింది. తాజాగా ఆయనను తమ దేశంలోకి రానిచ్చేందుకు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 20 వరకు జాకీర్ నాయక్‌కు అనుమతి లభించినట్టు మొదట అక్టోబర్ చివర్లో మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ వారం రోజుల్లోనే ఆ పర్యటన పూర్తిగా రద్దు అయినట్టుగా ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది.
2016లో ఢాకా హోలీ ఆర్టిజన్‌కేఫ్‌పై జరిగిన దాడిలో 29 మంది మరణించగా, జాకీర్ నాయక్ ప్రసంగాలతోనే ఉగ్రవాదులు ప్రేరణ పొంది దాడికి పాల్పడ్డారని బంగ్లాదేశ్.. జాకీర్ నాయక్‌పై నిషేధం విధించింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆయన పర్యటనకు అనుమతి నిరాకరించింది.