న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం బిసిసిఐ(బీసీసీఐ) టీమిండియా జట్టును ప్రకటించింది. శుభ్ మన్ గిల్ సారథ్యంలోని15 మంది సభ్యుల జట్టును బుధవారం ఎంపిక చేసింది. ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో గాయపడిన రిషబ్ పంత్ కోలుకుని మళ్లీ జట్టులోకి తిరిగి వచ్చాడు. దక్షిణాఫ్రికా Aతో జరిగిన మొదటి అనధికారిక మ్యాచ్‌లో ఇండియా ఎకి విజయాన్ని అందించిన పంత్.. తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకున్నాడు. పంత్ తోపాటు ఆకాష్ దీప్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు. కాగా, భారత్-దక్షిణాఫ్రికా మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ నవంబర్ 14 నుండి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనుంది. నవంబర్ 22 నుండి గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో రెండో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ఈ స్టేడియం మొదటిసారి టెస్ట్ క్రికెట్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది.
భారత జట్టు:
శుబ్మాన్ గిల్ (సి), రిషబ్ పంత్ (WK) (VC), యశస్వి జైస్వాల్, KL రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆకాష్ దీప్