మన తెలంగాణ/హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా బిజెపి, కాంగ్రెస్‌పార్టీల మధ్య మాటల తూ టాలు పేలుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు, నిలదీతలతో బిజెపి, కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు మా టల దాడి చేసుకుంటున్నారు. ఉప ఎన్నిక ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇత ర రాష్ట్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తాజాగా మాట్లాడుతూ బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఉందని, అందుకే కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీశ్‌రావులను సీబీఐ అరెస్ట్ చేయడం లేదని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నెల 11లోగా వీరిద్దరిని సీబీఐతో అరెస్ట్ చేయించి బీజేపీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కిషన్‌రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. తమ ప్రభుత్వం కేసును సీబీఐకి అప్పగించి మూడు నెలలు గడుస్తున్నా ‘ఎందుకు చర్యలు తీసుకోలేదని రేవంత్ రెడ్డి కేంద్రంపై ధ్వజమెత్తారు.
ఇందుకు కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి బుధవారం తన జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి ముందు మీడియాతో మాట్లాడుతూ అంతే ధీటుగా రేవంత్‌రెడ్డికి సమాధానం ఇచ్చారు. బిజెపి ఎన్నికలకు ముం దు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, అవకతవకలపై విచారణ జరిపిస్తామని ఎటువంటి హామీ ఇవ్వలేదని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు రేవంత్‌రెడ్డే కేసీఆర్, హరీశ్‌లను అరెస్ట్ చేయాలని సవాల్ విసిరారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఎందుకు వారిని అరెస్టు చేయలేదని కిషన్‌రెడ్డి నిలదీశారు. తమకు సంబంధం లేని విషయాలను ఆపాదించడం సరికాదని అన్నారు. అరెస్టులు సం గతి పక్కన పెట్టి రేవంత్‌రెడ్డి ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన డిక్లరేషన్లు, 420 హామీలపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. తమపై అకారణంగా ఆరోపణలు చేయడం సరికాదని, ప్రజలకు ఇచ్చిన హామీలపై ప్రభు త్వం దృష్టిసారించాలని కిషన్‌రెడ్డి హితవు పలికారు.
అవినీతి పెరిగిందే తప్ప తగ్గలేదు
తెలంగాణలో కెసిఆర్ పోయి, రేవంత్‌రెడ్డి వచ్చినా అవినీతి పెరిగిందే తప్ప తగ్గలేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. అడుగడుగునా రాష్ట్రం లో అవినీతి తాండవిస్తోందని ఆరోపించారు. నిరుద్యోగులతో సహా అన్ని వర్గాలను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మో సం చేసిందని ఆరోపించారు. ఎర్రగడ్డ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డికి మద్దతుగా బుధవారం సా యంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించిన కిషన్‌రెడ్డి గత కెసిఆర్ ప్రభుత్వం, ఇప్పటి రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో సీఎం పదవిలోకి కేసీఆర్ పోయి రేవంత్ రెడ్డి వచ్చినా అవినీతి తగ్గలేదని, ఇంకా ఏ ముఖం పెట్టుకుని రేవంత్ ఓట్లు అడుగుతున్నారని నిలదీశారు. మైనార్టీ ఓట్లతో కాంగ్రెస్ ఈ ఎన్నికలో విజ యం సాధించాలని చూస్తోందని విమర్శించారు. పెళ్లయిన ఆడబిడ్డలకు తులం బంగారం, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాల గురించి అడిగితే మహిళలకు ఇచ్చిన ఫ్రీ బస్సు గురించి మాట్లాడి దాట వేత వైఖరిని అవలంభిస్తున్నారని అన్నారు. జాబ్‌క్యాలెండర్, బంగారం కానుకలు ఎక్కడికి పోయాయని నిలదీశారు. వెంకటగిరి, యూ సుఫ్ గూడా డివిజన్‌లలో బిజెపి కార్యకర్తలతో కలి సి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. సాయంత్రం బోరబండ డివిజన్, ఎర్రగడ్డ డివిజపలో బిజెపి అభ్యర్థి దీపక్‌రెడ్డికి మద్దతుగా బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.