ఛండీగఢ్: పంజాబ్ లోని లుథియానా జిల్లాలో సమ్రాలా బ్లాక్‌లో కబడ్డీ ఆటగాడు గుర్వీందర్ సింగ్‌ను ఆగంతకులు కాల్చి చంపారు. ఈ హత్యకు బాధ్యత వహిస్తూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అన్మోల్ బిష్ణోయ్ పేరున సోషల్ మీడియాలో పోస్ట్ వెలువడింది. గుర్వీందర్ సింగ్‌ను తమ గ్యాంగ్ కు చెందిన కరణ్, తేజ్ చక్ హత్యచేశారని వెల్లడించింది. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇక, అక్టోబర్ 31న లుథియానాకు చెందిన తేజ్‌పాల్ సింగ్ అనే 26 ఏళ్ల కబడ్డీ ఆటగాడు కూడా హత్యకు గురయ్యాడు. తేజ్‌పాల్ స్నేహితులే అతన్ని హత్య చేశారని పోలీసులు వెల్లడించారు. కొన్ని రోజుల వ్యవధిలోనే ఇద్దరు కబడ్డీ ఆటగాళ్లు హత్యకు గురికావడం రాష్ట్రంలో సంచలనం మారింది.