ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త, హిందూ జా గ్రూప్ చైర్మన్ గోపీచంద్ పి. హిందూజా (85) సోమవారం లండన్‌లో కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 2023లో ఆయన సోదరుడు శ్రీచంద్ హిందూ జా మరణం తర్వాత గోపీచంద్ (జి.పి.) హిందూజా కుటుంబం రెండో తరం నాయకుడిగా గ్రూప్ పగ్గాలు చేపట్టారు. ఆయన సారథ్యంలో గ్రూప్‌ను ప్రపంచ వ్యాప్తంగా విస్తరించారు. 1940లో సింధ్‌లో జన్మించిన గోపీచంద్ హిందూజా ముంబైలో పెరిగారు. 1959 సంవత్సరంలో ముంబైలోని జైహింద్ కళాశాల నుండి పట్టభద్రుడయ్యారు. వెస్ట్‌మినిస్టర్ విశ్వవిద్యాలయం, రిచ్‌మండ్ కళాశాలల నుండి గౌరవ డాక్టరేట్‌లు అందుకున్నారు.
1959లో కుటుం బ వ్యాపారంలో చేరి, హిందూజా గ్రూప్‌ను బ్యాంకింగ్, ఎనర్జీ, ఫైనాన్స్, ఆటోమోటివ్ రంగాల్లో విస్తరించారు. ఆయన నాయకత్వంలో గల్ఫ్ ఆయిల్, అశోక్ లేలాండ్ వంటి ప్రముఖ సంస్థలను గ్రూప్ అధిగమించింది. గోపీచంద్‌కు ఇద్దరు కుమారులు సంజయ్, ధీరజ్, కుమార్తె రీటా ఉన్నారు. 2015లో సంజయ్ వివాహం ఉదయపూర్‌లో వైభవంగా జరిగింది, అందులో జెన్నిఫర్ లోపెజ్, నికోల్ షెర్జింగర్ ప్రదర్శనలు ఇచ్చారు. 1914లో స్థాపించిన హిందూజా గ్రూ ప్ ప్రస్తుతం 48 దేశాల్లో వ్యాపారాలు నిర్వహి స్తూ, 2 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. లం డన్‌లోని ఓల్ వార్ ఆఫీస్ భవనం (ప్రస్తుత రా ఫెల్స్ హోటల్) సహా పలు ప్రతిష్ఠాత్మక ఆస్తులు కుటుంబం సొంతం చేసుకుంది. భారత మూ లాల నుంచి ప్రపంచ వ్యాప్తంగా వ్యాపార సా మ్రాజ్యాన్ని నిర్మించిన గోపీచంద్ హిందూజా మరణం పారిశ్రామిక ప్రపంచానికి తీరని లోటు అని పరిశ్రమ నాయకులు పేర్కొంటున్నారు.