మన తెలంగాణ/వరంగల్ కార్పొరేషన్/నాగర్‌కర్నూల్ /మహేశ్వరం : వరంగల్,నాగర్‌కర్నూల్, రంగారెడ్డిజిల్లాలో మంగళవారం భారీ వర్షాలు పడ్డాయి. వరంగల్ ఏనుమాముల మార్కెట్‌లో వ ర్షం కారణంగా పత్తి బస్తాలు తడిసిపోవడంతో రై తులు లబోదిబోమన్నారు. నాలుగు రోజుల క్రిత మే వాతావరణ శాఖ వరుణుడు మళ్లీ విరజిమ్మనున్నట్లు హెచ్చరించినా ఏనుమాముల మార్కెట్ యార్డు అధికారులు రైతులకు తాటిపత్రులు సమయానికి ఇవ్వకపోవడంతో పత్తి బస్తాలు వర్షాని కి తడిసిపోయాయి. రైతులు పత్తిని మార్కెట్‌కు తెచ్చినా వర్షం కారణంగా బస్తాలు నీటిలో తడిసిపోతున్నాయని అన్నారు. అధికారులు పరిస్థితిని గమనించి ముందుగానే సరిపడా తాడిపత్రులు ఏర్పాటు చేసి ఉంటే ఈ నష్టం తప్పేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చర్యలు తీ సుకొని తాటిపత్రులు పంపిణీ చేయాలని రైతులు కోరుతున్నారు. కాగా నాగర్‌కర్నూల్ జిల్లా కేం ద్రంతో పాటు, నాగర్‌కర్నూల్ మండల పరిధిలో ని చుట్టుపక్కల గ్రామాల్లో మంగళవారం మధ్యా హ్నం అకాల వర్షం కురిసింది. ప్రధాన రహదారిపై ఎక్కడి వాహనాలు అక్కడే వాన వరద కారణంగా దాదాపు మూడు గంటల పాటు నిలిచిపోయాయి.
ఆరుగాలం రైతులు కష్టపడి పండించిన వరి, పత్తి తదితర పంటలు విక్రయానికి సిద్ధంగా ఉండగా అకాల వర్షం కారణంగా వారి కష్టం నీటిపాలైందని లబోదిబోమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వపరంగా రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. రంగారెడ్డి జిల్లా, మహేశ్వరంలో మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షాలకు రామచంద్రగూడ కుంట తెగిం ది. దీంతో మోడల్ స్కూల్, కస్తూర్బా స్కూల్, డైట్ కాలేజీలు నీట మునిగాయి. విద్యార్థులు భయందోళనతో బిక్కుబిక్కుమంటూ సహాయం కోసం ఎదురుచూశారు. పోలీసులు, స్థానికులు స్పం దించి సహాయక చర్యలు చేపట్టి విద్యార్థులను వ రద నీటి నుండి రక్షించారు. అయితే వరద నీటి లో విద్యార్థుల వస్తువులు పాఠ్య పుస్తకాలు నీటిపాలయ్యాయి. ఇళ్లలోకి వరదనీరు చేరడంతో, స్థానిక పోలీసు శాఖ నేతృత్వంలో సహాయక చర్యలు చేపట్టారు. సిఐ వెంకటేశ్వరులు, ఎస్‌ఐలు ప్రసాద్, రాఘవేందర్‌రావు, ధనుంజయ్ తదితరులు వరద నీరు చేరిన బాధితుల ఇళ్లల్లో పర్యటించి, నీటమునిగిన ఇళ్ల నిర్మాణ నష్టం, నివాసితుల పరిస్థితులను సమీక్షించారు. బాధిత కుటుంబాలకు తక్షణ సహాయ చర్యలు తీసుకోవాలని, సంబంధిత అధికారులకు సమస్యలపై సూచనలు అందజేశారు.