అతడో డాక్టర్ పేరు డాక్టర్ మహేంద్ర రెడ్డి, తన భార్యను హత్యచేశాడనే ఆరోపణలతో గతనెల అరెస్ట్ అయ్యాడు.హత్య చేసిన కొన్నివారాల తర్వాత నలుగురు, ఐదుగురు మహిళలకు ‘నీ కోసమే నా పెళ్లాన్ని చంపేశా‘ అని దారుణమైన సందేశం పంపాడని పోలీసులు మంగళవారం తెలిపారు.వారిలో గతంలో అతడిని తిరస్కరించిన మెడికల్ ప్రొఫెషన్ లో ఉన్న మహిళ కూడా ఉందట. ఫోన్ పే చెల్లింపు యాప్ ద్వారా ఈ సందేశం పంపాడు. అతడి భార్య కూడా చర్మవ్యాధుల నిపుణురాలైన డాక్టరే. డాక్టర్ మహేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత అతడి ఫోన్ ను, ల్యాప్ టాప్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ సైన్స్ లాబోరెటరీకి పంపగా, ఈ సందేశాలు వెలుగులోకి వచ్చాయి.
డాక్టర్ మహేందర్ రెడ్డి, డాక్టర్ కృతిక విక్టోరియా హాస్పిటల్ లో పనిచేశారు. 2024 మే 26న వారు వివాహం చేసుకున్నారు. ఒక సంవత్సరం లోపే 2025 ఏప్రిల్ 23న కృతిక ఆరోగ్య సమస్యల కారణంగా మారత హళ్లి ప్రాంతంలోని తన తండ్రి ఇంట్లో కుప్పకూలిపోయింది.భార్యను చూసే మిషతో వెళ్లిన మహేంద్ర రెండురోజులుగా ఆమెకు ఇంట్రావీనస్ ఇంజెక్షన్లు ఇచ్చి, ఆమె కోలుకునేటట్లు చేసేందుకు చికిత్సలో భాగంగానే ఇంజక్షన్లు ఇచ్చినట్లు కుటుంబ సభ్యులకు చెప్పాడు. ఆమె పరిస్థితి మరీ దిగజారడంతో దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తీసుకువెళ్తే ఆమె మరణించినట్లు అక్కడి డాక్టర్లు ప్రకటించారు. మొదట్లో పోలీసులు అనుమానాస్పద మృతిగా నమోదు చేశారు. అయితే, డాక్టర్ కృతిక చెల్లెలు డాక్టర్ నిఖిత ఎం రెడ్డి కి అనుమానం రావడంతో పూర్తగా దర్యాప్తు చేయాలని కోరగా, ఆరు నెలల తర్వాత
ఫోరెన్సిక్ నివేదికలో మృతురాలి శరీరంలోని పలు అవయవాలలో ఫ్రోఫో ఫోల్ అనే మత్తుమందు అవశేషాలు ఉన్నట్లు నిర్థారణ అయింది. కృతికకు అధిక మొత్తంలో మత్తుమంది ఇచ్చినట్లు స్పష్టమైంది. ఆ తర్వాత ఆ కేసును పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి, భారతీయ న్యాయ సంహిత (బిఎన్ ఎస్ ) 2023 సెక్షన్ 103 కింద రిజిస్టర్ చేసి ఉడిపి లోని మణిపాల్ లో ఉన్న మహేంద్రను అరెస్ట్ చేశారు. భార్యను హత్య చేసిన తర్వాత నుంచి మహేంద్ర అక్కడికి మకాం మార్చినట్లు పోలీసులు తెలిపారు.
నిజానికి మహేంద్ర రెడ్డి కుటుంబానికి క్రిమినల్ కేసుల చరిత్రనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మహేంద్ర రెడ్డి కవల సోదరుడు డాక్టర్ నాగేంద్ర రెడ్డి 2018లో చాలా కేసులు ఎదుర్కొన్నాడు. వాటిలో మోసం, క్రిమినల్ కేసులు ఉన్నాయి. మరో సోదరుడు రాఘవ రెడ్డి కూడా 2023 లో ఓ బెదిరింపు కేసులో నహ నిందితుడు. అయితే మహేంద్ర రెడ్డి, కృతిక వివాహ సమయంలో ఈ వివరాలను ఆ కుటుంబం దాచి పెట్టారని కృతిక కుటుంబ సభ్యులు ఆరోపించారు.