రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. మంగళవారం బిలాస్‌పూర్‌లో రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందినట్లు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో లాల్‌ఖదాన్ ప్రాంతంలో మెము ప్యాసింజర్, గూడ్స్ రైళ్లు ఎధురెదురుగా ఢీకొన్నాయి. దీంతో పలు భోగీలు పట్టాలు తప్పాయి. దీంతో బిలాస్‌పూర్-హావ్‌డా లైన్ మార్గంలో రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాంతో పలు సర్వీసులు రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. ఈ ఘటన వల్ల మార్గంలోని ఎలక్ట్రిక్ వైర్లు, సిగ్నల్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనస్థలికి చేరుకొని సహాయకచర్యలు చేపట్టారు.