రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఘోర బస్సు ప్రమాదంపై రాష్ట్ర మానవ హక్కుల సంఘం స్పందించింది. ఈ ఘటనను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్‌ఆర్‌సి) సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేసింది. మీడియా ఛానల్స్, పలు పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారం గా కమిషన్ చర్యలు తీసుకుంది. చేవెళ్ల-తాండూరు మధ్య ప్రాంతాన్ని డెత్ కారిడార్‌గా అభివర్ణిస్తూ, ఈ మార్గంలో నెలకొన్న ప్రమాదకర పరిస్థితు లపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రాంతంలో తరచూ ప్రాణాంతక ప్రమాదాలు జరగడానికి గల కారణాలను హెచ్‌ఆర్‌సి విశ్లేషించింది. రోడ్డు పరిస్థితులు అధ్వాన్నంగా ఉండటం, డివైడర్లు లేకపోవడం, వాహనాల అతి వేగం, ఓవర్ లోడింగ్, ఎన్‌హెచ్ 163 జాతీయ రహదారి విస్త రణ పనులలో జరుగుతున్న తీవ్ర జాప్యం వంటి అంశాలు ఈ ప్రమాదాలకు దారితీస్తున్నాయని కమిషన్ అభిప్రాయపడింది. ఇది పూర్తిగా పరి పాలనా నిర్లక్ష్యం, సంబంధిత అధికారుల వైఫల్యమేనని హెచ్‌ఆర్‌సి తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
ఈ సంఘటనపై డిసెంబర్ 15వ తేదీన ఉద యం 11 గంటలలోపు సమగ్ర నివేదికను సమర్పించాల్సిందిగా ఆయా శాఖలను రాష్ట్ర మానవ హక్కుల సంఘం ఆదేశించింది. ఈ మేరకు రవా ణా శాఖ, హోంశాఖ, భూగర్భ గనుల శాఖల ముఖ్య కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. జాతీయ రహదారుల ప్రాంతీయ అధికారి, రంగా రెడ్డి జిల్లా కలెక్టర్, ఆర్‌టిసి ఎండిలను సైతం నివేదిక పంపాలని ఆదేశించింది. చేవెళ్ల మీర్జాగూడ వద్ధ ఆర్టీసీ బస్సును కంకర టిప్పర్ ఢీకొన్న ఘటన లో 19 మంది ప్రాణాలు కోల్పోగా, 24 మందికి గాయాలైన సంగతి విదితమే. ఈ ఘటన బస్సు ప్రయాణికుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. రోడ్డు మార్గం సక్రమంగా లేకపోవడం, టిప్పర్ అతివేగం ప్రమాదానికి దారి తీశాయి. ప్రమాదం తర్వాత రోడ్డు విస్తరణ కోసం స్థాని కులు వరుస ఆందోళనలు కొనసాగిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని మంగళ వారం ఆందోళనకారులు ఘెరావ్ చేశారు.