చత్తీస్‌గఢ్‌లో రెండు రైళ్లు ఢీకొన్నాయి. బిలాస్‌పూర్ స్టేషన్‌కు సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. 14మందికి గాయాలయ్యాయి. మంగళవారంనాడు 4గంటలకు గటోరాబిలాస్‌పూర్ స్టేషన్ల మధ్య ఈ దుర్ఘటన జరిగింది. పొరుగున ఉన్న కోబ్రా జిల్లాలోని గెవ్రాకు వెళ్తున్న గూడ్స్ రైలును వెనక నుంచి మెమూ ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. దీంతో ప్యాసింజర్ రైలు ఇంజిన్ గూడ్స్ బోగీపైకి ఎక్కింది. క్షతగాత్రులను బిలాస్‌పూర్‌లోని సిఐఎంఎస్, అపోలో ఆస్పత్రులకు తరలించి చికిత్స అందజేస్తున్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించారు. అయితే, గాయపడిన వారి సంఖ్యను ఆయన ధృవీకరించలేదు.
మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడిన వారికి 5 లక్షల రూపాయలు, స్వల్పంగా గాయపడిన వారికి 1 లక్ష రూపాయల సహాయాన్ని రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణకు రైల్వే ఆదేశించింది. రైల్వే యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన సహాయ, రక్షణ కార్యకలాపాలను ప్రారంభించింది. పరిస్థితిని పర్యవేక్షించడానికి సీనియర్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంపై సిఎం విష్ణుదేవ్ సహాయ్ విచారం వ్యక్తం చేశారు. బిలాస్‌పూర్ జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి సహాయక చర్యలపై ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. సహాయక చర్యలు వేగవంతం చేసి రైళ్ల రాకపోకలు పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.