తెలంగాణ వ్యాప్తంగా పంచాయతీ కార్యాలయాల్లో ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పని చేస్తున్న 1037 మంది ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల సేవలను మరో ఏడాది పొడిగిస్తూ పంచాయతీరాజ్ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి నెలకు రూ.19,500 వేతనం ప్రస్తుతం చెల్లిస్తున్న మాదిరిగానే మరో ఏడాది పాటు కూడా వారికి వేతనం చెల్లించేందుకు నియమనిబంధనలు వెల్లడిస్తూ ప్రభుత్వం జివో విడుదల చేసింది. జిల్లాలో పంచాయతీ సెక్రటరీల సంఖ్య గ్రామ పంచాయతీల సంఖ్యను మించకుండా చూసుకోవాలని ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు వీరి సేవలు వినియోగించుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.