రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ను నిలిపివేయడాన్ని సవాల్ చేస్తూ సురేందర్ అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ విచారణను హైకోర్టు ధర్మాసనం నవంబర్ 24కి వాయిదా వేసింది. సోమవారం ఈ పిటిషన్ విచారించిన ధర్మాసనం స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ నుండి స్పష్టత కోరింది. ఈ క్రమంలో ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించడానికి సమయం కోరారు. ఎన్నికల సంఘం తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఎన్నికలు నిర్వహించడానికి సిద్దంగా ఉన్నామని కోర్టుకు తెలిపారు. దీంతో ధర్మాసనం పిటిషన్ తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం అక్టోబర్ 9న నిలిపివేసిన విషయం విధితమే. ఈ అంశాన్ని సవాల్ చేస్తూ సురేందర్ అనే న్యాయవాది హైకోర్ట్టును ఆశ్రయించారు00000