ముంబై: విశ్వవిజేతగా నిలిచిన భారత మహిళా క్రికెట్ టీమ్‌పై సౌతాఫ్రికా జట్టు కెప్టెన్ లౌరా వాల్వర్ట్ ప్రశంసల వర్షం కురిపించింది. టీమిండియా అసాధారణ పోరాట పటిమతో ప్రపంచకప్ ట్రోఫీని సొంతం చేసుకుందని తెలిపింది. షెఫాలీ వర్మతో బౌలింగ్ చేయిస్తారని తాము ఊహించలేదని లౌరా పేర్కొంది. షెఫాలీ బౌలింగ్‌పై తమకి పెద్దగా అవగాహన లేదని, అదే తాము వెంటవెంటనే వికెట్లను కోల్పోవడానికి ప్రధాన కారణమని వివరించింది. ఈ మ్యాచ్‌లో అదే టర్నింగ్ పాయింట్ అనడంలో ఎలాంటి సందేహం లేదని వాల్వర్ట్ అభిప్రాయపడింది.