మహిళల ప్రపంచకప్‌ను తొలిసారి భారత జట్టు అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకూ మూడుసార్లు ప్రపంచకప్ ఫైనల్స్‌కి చేరిన భారత్.. ఎట్టకేలకు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. ఈ విజయంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కీలక పాత్ర పోషించింది. జట్టును సమర్థవంతంగా ముందుకు నడిపిస్తూ.. జట్టును విశ్వవిజేతగా చేసింది. ఈ సందర్భంగా హర్మన్‌పై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది.
అయితే ఇంతకాలంగా టెన్షన్‌లో ఉన్న హర్మన్‌ప్రీత్.. ఇప్పుడు ప్రపంచకప్ గెలవడంతో రిలాక్స్ అవుతోంది. ఈ సందర్భంగా ఆమె సోషల్‌మీడియాలో పెట్టిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతోంది. హర్మన్ చేతిలో ప్రపంచకప్‌ను పట్టుకొని పడుకోవడం మనం ఆ ఫోటోలు చూడొచ్చు. అన్నిటికన్న.. ఆ ఫోటోలో ఆమె ధరించిన టి-షర్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దానిపై ‘క్రికెట్ అంటే కేవలం జెంటిల్‌మెన్స్ గేమ్ కాదు.. అది అందరి గేమ్’ అని రాసి ఉంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.