పాట్నా: ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోడీ మాటలు అభ్యంతరకరం అని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ మండిపడ్డారు. తాము కాంగ్రెస్‌పై కట్టా (నాటు తుపాకీ) పెట్టి బెదిరించామని చెప్పడం ప్రధాని స్థాయి వ్యక్తికి సబబా అని ప్రశ్నించారు. అయితే ఆయన వ్యాఖ్యలను ప్రజలు ఏ విధంగా తీసుకుంటారనేది ప్రజలకే వదిలిపెడుతున్నట్లు పాట్నాలో విలేకరుల సమావేశంలో తేజస్వీ చెప్పారు.
దేశ ప్రధాని గుజరాత్‌కు వెళ్లినప్పుడు ఎప్పుడూ ఐటి ఫ్యాక్టరీలు, సెమికండక్టర్ల గురించి, డాటా సెంటర్ల గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆయన బీహార్‌కు వస్తే నాటుతుపాకులు, బాంబుల గురించి చెపుతూ ఉంటారని, ఇదేం తీరు అని నిలదీశారు. బీహార్ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రచారం మంగళవారం సాయంత్రానికి ముగుస్తుంది. ఈ దశలో నేతల పరస్పర విమర్శలతో ప్రచారంవేడెక్కింది.