నాచారం: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిని పొడిచి చంపారు. మల్లాపూర్ లో ఒక వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తి తో పొడిచి చంపారు. స్థానికుల సమాచారం నాచారం పోలీసులు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వయసు సుమారు 45 సంవత్సరాలు ఉంటుందని అంచనాకు వచ్చారు. నిందితులను పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.