లాన్యూఢిల్లీ : తనను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని లాయర్ పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇటువంటి అప్పీళ్లతో న్యాయవ్యవస్థను గేలిచేయవద్దని పిటిషనర్‌ను తీవ్రంగా మందలించింది. తనకు హైకోర్టు జడ్జిగా పదోన్నతి కల్పించాలని జివి శ్రవణ్‌కుమార్ అనే న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు తగు కార్యనిర్వాహక ఆదేశాలు వెలువరించాలని కూడా వేడుకున్నారు.
ఇది చెత్తబుట్ట పాలయ్యే పిటిషన్‌గా ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయ ప్రక్రియతో తమషాలకు దిగుతున్నారా? ఇదేం పద్థతి అంటూ న్యాయమూర్తులు కె వినోద్ చంద్రన్‌తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఒక పనిచేస్తాం, జడ్జిగా మీ ఎంపిక గురించి సీనియర్ జడ్జిటతో త్రిసభ్య కొలిజీయంను ఏర్పాటు చేస్తాం, వారు ఈ విషయం పరిశీలిస్తారని జస్టిస్ గవాయ్ చురకలు పెట్టారు.