ఆస్ట్రేలియాలో ప్రస్తుతం టీం ఇండియా పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వన్డే సిరీస్‌ని ఆతిథ్య జట్టు 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ప్రస్తుతం ఐదు టీ-20ల సిరీస్ జరుగుతోంది. ఇప్పటికే మూడు టి-20లు పూర్తిగా ఇరు జట్లు చెరో మ్యాచ్‌లో విజయం సాదించాయి. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. అయితే నాలుగో టి-20కి ముందు ఆసీస్ సెలక్టర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈ సిరీస్‌లో జరిగే చివరి రెండు మ్యాచ్‌లకు విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్‌కు జట్టు నుంచ విడుదల చేశారు. షెఫీల్డ్ షీల్డ్‌లో సౌత్ ఆస్ట్రేలియా తరఫున ఆడాలని సూచించారు. ఈ నిర్ణయం యాషస్ సిరీస్ వ్యూహాల్లో భాగంగా తీసుకోబడింది. పని భారం తగ్గించేందుకే హెడ్‌కు చివరి రెండు టి-20ల నుంచి విశ్రాంతి కల్పించారు. అయితే హెడ్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. ఈ రెండు సిరీసులలో హెడ్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. రెండో టి-20లో 28, మూడో మ్యాచ్‌లో 6 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. అంతకు ముందు జరిగిన వన్డే సిరీస్‌లో కూడా మూడు మ్యాచ్‌ల్లో వరుసగా 8, 28, 29 పరుగులు చేశాడు.