న్యూఢిల్లీ: 2026 జెఇఇ మొయిన్ పరీక్షలలో అభ్యర్థులు కాల్‌క్యులేటర్లు వాడుకోవడానికి వీల్లేదు. ఈ మేరకు ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ జెఇఇ మొయిన్ పరీక్షలు నిర్వహించే జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టిఎ ) సోమవారం ప్రకటన వెలువరించింది. ఈ విషయంలో ఇంతరకు ముందటి సమాచారంలో తప్పులు దొర్లాయి. వీటిని ఇప్పుడు సవరించి తాజా ప్రకటన వెలువరిస్తున్నట్లు తెలిపారు.
అంతకుముందు వెలువరించిన బులెటిన్‌లో ఆన్‌స్క్రీన్ స్టాండర్డ్ కాల్‌క్యులేటర్ కేవలం కంప్యూటర్ల ద్వారా జరిగే పరీక్ష (సిబిటి)కి అనుమతిస్తారని పేర్కొన్నారని, ఇది ఎన్‌టిఎ నిర్వహించే మొయిన్ పరీక్షకు వర్తించబోదని అధికారి ఒకరు తెలిపారు. జరిగిన పొరపాటుకు చింతిస్తున్నామని, ఇది టైపోగ్రాఫిక్ తప్పిదం అని వివరించారు.