మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో బిజెపి కేంద్ర బిందువుగా మా రిందని కేంద్ర బొగ్గు గ నుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సోమవా రం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్‌వి సుభాష్, పార్టీ సీనియర్ నాయకుడు ప్రకా ష్‌రె డ్డితో కలిసి ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ముస్లిం ఓట్లను ఆకర్షించేందుకు అజ హరుద్దీన్‌ను కేబినెట్‌లోకి తీసుకున్నారని కిషన్ రెడ్డి అన్నారు. టిడిపి, జనసేన పార్టీలూ ఎన్డీయే భాగస్వామ్యపక్షాలు కాబట్టి జూబ్లీహిల్స్‌లో తమ పార్టీ అభ్యర్థికి మద్దతునిస్తున్నాయని తెలిపారు. ఎపి డి ప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ప్రచారం చేయాల్సిందిగా కోరలేదన్నారు. సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి గురించి ఫ్రశ్నించగా, ‘చిరు’ ప్రధాని నరేంద్ర మోడికి అభిమాని అని ఆయన తెలిపారు.
ఎన్నికలకు ఇంకా మూడేళ్ళ గడువు ఉన్నా, ఐదు వందల రోజుల్లో ఎన్నికలు వస్తాయని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కలలు కంటున్నార ని ఆయన విమర్శించా రు. మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచారం చే సిన కెసిఆర్, ఇప్పుడు జూబ్లీకి ఎందుకు రా వడం లేదని ప్రశ్నించా రు. బిఆర్‌ఎస్-, కాంగ్రెస్ బంధం ఉందనడానికి తాజా ఉదాహరణగా కెటిఆ ర్ రాహుల్ గాంధీని ఉద్ధేశించి ట్విట్టర్‌లో పేర్కొనడమేనని అన్నారు. జూబ్లీ ఎన్నిక కాంగ్రెస్‌కు రెఫరెండం కాదన్నారు. దానం నాగేందర్‌పై వేటు పడితే ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తుందని, అప్పుడు అది కూడా తమ ఖాతాలో పడుతుందని ఆయన ధీమాగా చెప్పారు. కెకే సర్వే గురించి ప్రశ్నించగా, కెకే ఎవరో తనకు తెలియదన్నారు. పైగా ఆ సర్వే ఎక్కడి నుంచి చేశారు?, బాత్రూం నుంచి చేశారా?, బెడ్ రూం నుంచి చేశారా?, డ్రాయింగ్ రూం నుంచి చేశారా? అని ఆయన ఎదురు ప్రశ్నించారు.