చెన్నై: తమిళనాడులో ఓటర్ల జాబితాలో సమగ్ర సవరణకు ఎన్నికల సంఘం సిద్ధం కావడాన్ని వ్యతిరేకిస్తూ డిఎంకె ప్రభుత్వం సోమవారం సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. పార్టీ ఎంపీ, సీనియర్ అడ్వకేట్ ఎన్‌ఆర్ ఎలాంగో ఈమేరకు ప్రభుత్వం తరఫున రిట్ పిటిషన్ దాఖలు చేశారని డిఎంకె ప్రకటన వెల్లడించింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)పై వివిధ పార్టీలతో ముఖ్యమంత్రి స్టాలిన్ సమావేశం నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నారు.