బస్సు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీ వ్ర విషాదాన్ని నింపింది. ఉదయాన్నే ఉద్యోగాలు, చదువులు, ఇతర పనుల నిమిత్తం బస్సు ఎ క్కిన వారికి అదే చివరి ప్రయాణమైంది. ప్రమాద ఘటన ఓ కు టుంబంలో పెను విషాదాన్ని నిం పింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు సాయిప్రి య, తనుషా, నందిని ఈ దుర్ఘటనలో మృతి చెందారు. సోమవా రం ఉదయం తమ ముగ్గురు కు మార్తెలను తండ్రి స్వయంగా బస్‌స్టాప్‌లో దింపి వెళ్లాడు. తం డ్రికి చిరునవ్వుతో బాయ్ చెప్పిన ఆ ముగ్గురు సోదరీమణులకు అదే ఆఖరి ప్రయాణం అని తెలీదు. ఎంతో సంతోషంగా బస్సు ఎక్కి ప్ర యాణం సాగించారు. కానీ అంతలోనే బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. ఈ ముగ్గురు హైదరాబాద్‌లోని వివిధ కాలేజీల్లో బిటెక్ మూడు, బిటెక్ రెండవ, మొదటి సంవత్సరం చదువుతున్నారు. వీరి తండ్రి డ్రైవర్. గత నెలలోనే పెద్ద కుమార్తె వివాహం జరిపించాడు. ఎంతో సంతోషంగా ఉన్న సమయంలో మిగిలిన ముగ్గురు బిడ్డలు ఇలా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తండ్రి కన్నీరు మున్నీరుగా విలపించాడు. ‘మా పిల్లల్ని మాకు తిరిగి ఇప్పించండి’ అంటూ ఆ తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు అక్కడి వారి హృదయం ద్రవింపజేసింది.
బస్సు ప్రమాదంలో మరణించిన అక్కా చెల్లెళ్లలో ఇద్దరు కోఠిలోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వ విద్యాలయంలో బీఎస్సీ తృతీయ సంవత్సరం విద్యనభ్యసిస్తున్న సాయిప్రియ, బీకాం మొదటి సంవత్సరం చదువుతున్న నందినిలు ఉండగా, మరో సోదరి నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఎంబీఏ విద్యనభ్య సిస్తున్న తనూషతో పాటు కోఠిలోని మహిళా విశ్వవిద్యాలయంలో బీఎస్సీ తృతీయ సంవత్సరం విద్యనభ్యసిస్తున్న ముస్కాన్‌లు ఉన్నారు. ప్రతి రోజూ తమతో ఎంతో ఉత్సాహంగా, సరదాలో గడిపిన సాయిప్రియ, నందిని, ముస్కాన్‌లు బస్సు ప్రమాదంలో మృతి చెందారన్న వార్తను జీర్ణించుకోలేక పోతున్నామంటూ వారి సహచర విద్యార్థినులు కన్నీరుమున్నీయ్యారు. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఫ్రొఫెసర్ సూర్య ధనుంజయ్, కళాశాల ప్రిన్సిపల్ లోక పావని, బీఎస్సీ విభాగం అధ్యాపకురాళ్లు సంతాపం వ్యక్తం చేశారు. వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు.