వాషింగ్టన్: చాలా దేశాలు చురుగ్గా అణ్వాయుధాలు పరీక్షిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. పాకిస్థాన్ కూడా అణ్వాయుధాలను పరీక్షిస్తుందని అన్నారు. అణుపరీక్షలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోని ఇతర దేశాల కంటే యుఎస్ ఎక్కువ అణ్వాయుధాలు కలిగి ఉందని కొనియాడారు. ఈ మేరకు ట్రంప్ ట్రూత్ సోషల్ పోస్టు పెట్టారు. రష్యా, చైనా, ఉత్తర కొరియా, పాక్ అణుపరీక్షలు చేస్తున్నాయని, అణుపరీక్షలు చేస్తున్న దేశాలు ఆ విషంపై నోరు విప్పట్లేదు అని విమర్శించారు. తాము అలా కాదు.. ఏదైనా బహిరంగంగాను చేస్తాం అని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.