ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాలు చేసిన హీరో సిద్ధార్త్.. ప్రస్తుతం ఓ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. సిద్ధార్త్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ వెబ్‌సిరీస్ ‘ఆపరేషన్ సఫేద్ సాగర్. కార్గిల్ యుద్ధ నేపథ్యంలో ఈ వెబ్‌సిరీస్‌ని తెరకెక్కించారు. ఈ సినిమాకు ఓని సేన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ వెబ్‌సిరీస్ ఫస్ట్‌లుక్ గ్లింప్స్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సిరీస్‌లో జిమ్మీ షెర్గిల్, అభయ్ వర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. కార్గిల్ సమయంలో భారత వైమానిక దళం 47 రోజుల పాటు ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్ సఫేద్ సాగర్ వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో మిహిర్ అహుజా, తారుక్ రైనా, అర్నవ్ బాసిస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.