శ్రీహరికోట నుంచి ఎల్‌విఎం3-ఎం5 రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ బాహుబలి రాకెట్ అతి పెద్ద సిఎంఎస్-03 ఉపగ్రహాన్ని ఈ రాకెట్ నింగిలోకి మోసుకెళ్లింది. సిఎంఎస్-03 సమాచార ఉపగ్రహం బరువు 4,410 కిలోలు. ఈ ఉపగ్రహం భారత్‌కు సమాచారం సేవలు అందించనుంది. ఇప్పటివరకూ భారత్ ప్రవేశపెట్టిన ఉపగ్రహాల్లోకెల్లా ఇదే అతి పెద్దది కావడం విశేషం. హిందూ మహాసముద్రంలో చైనా నౌకల కదలికలకు చెక్ పెట్టేందుకు ఇది ఉపయోగపడనుంది. యుద్ధ నౌకలు, జలాంతర్గాములు కమ్మూనికేషన్ సాగించేందుకు ఇది తోడ్పాటు అందించనుంది. భూమిపైన నియంత్రణ కేంద్రాలతో సురక్షిత కమ్మూనికేషన్ కోసం తోడ్పాటు ఇవ్వనుంది. భూఅనువర్తిత బదిలీ కక్ష్య (జిటివొ)లోకి సిఎంఎస్-03 ప్రయోగం జరగనుంది. 2013 నుంచి జీశాట్-7 స్థానంలో సిఎంఎస్-03 సేవలు అందిస్తోంది. ఈ ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో ఛైర్మన్ వి.నారాయణన్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ ప్రయోగం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఆయన అభినందనలు తెలియజేశారు. ఈ ప్రయోగంతో భారత్ మరో ఘనత సాధించిందని అన్నారు.