మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మెడికల్ పిజి మేనేజ్‌మెంట్ కోటా సీట్లలో 85 శాతం తెలంగాణ విద్యార్థులకే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిం ది. ఇప్పటివరకూ మేనేజ్‌మెంట్ కోటా సీట్లన్నీ ఆలిండియా కేటగిరీలో భర్తీ జరుగుతుండగా, ఇకపై 85% సీట్లు తెలంగాణ బి డ్డలకే దక్కనున్నాయి. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రా జనర్సింహ విజ్ఞప్తి మేరకు సిఎం రేవంత్ రెడ్డి మేనేజ్‌మెం ట్ కోటాలో 85 శాతం సీట్లు లోకల్ విద్యార్థులకు కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పిజి కో సం ఎంబిబిఎస్ విద్యార్థులు పడుతున్న కష్టాలపై ప్రభు త్వం సరైన సమయంలో నిర్ణయం తీసుకున్నందుకు సి ఎం రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ కృతజ్ఞత లు తెలిపింది. వైద్య విద్యపై ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని పిసిసి డాక్టర్స్ సెల్ పెరగనున్నది. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ నిర్ణయం ఎంతగానో తోడ్పడుతుంది.
పదేళ్లుగా అన్యాయం…
మెడికల్ పిజి స్టేట్ కోటా మేనేజ్‌మెంట్ సీట్ల భర్తీలో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతూ వచ్చింది. 25 శాతంగా ఉన్న మేనేజ్‌మెంట్ కోటా- సీట్లలో తెలంగాణలో మాత్రం 100 శాతం ఆలిండియా కోటాగా చూపిస్తూ వస్తే ఎపిలో మాత్రం ఇదే కోటాను 85 శాతం స్థానికులకే రిజర్వ్ చేశారు. తెలంగాణలోనూ 25 శాతంగా ఉన్న మేనేజ్‌మెంట్ కోటా- సీట్లలో తెలంగాణలోనూ 85 శాతం స్థానిక అభ్యర్థులకే కేటాయించాలని రాష్ట్రానికి చెందిన వైద్య విద్యార్థులు, వారి తల్లితండ్రులు, వైద్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. కాగా, పదేళ్లు గత ప్రభుత్వం ఈ అంశాన్ని పట్టించుకోలేదు. గత ఏడాది వరకు కూడా ప్రభుత్వం పాత విధానంలోనే సీట్లను కేటాయించింది. స్థానిక కోటా లేకపోవడంపై మన వైద్య విద్యార్థులు తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎపిలో ఇస్తున్నప్పుడు మనమెందుకు మనను అన్యాయం చేసుకునుడు అని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయారు. విద్యార్థుల ఆవేదనను అర్థం చేసుకున్న వైద్య మంత్రి దామోదర్ రాజనర్సింహ… ఈ అంశాన్ని సిఎం రేవంత్ రెడ్డి దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లారు. మంత్రి విజ్ఞప్తికి స్పందించిన సిఎం వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
మన విద్యార్థులకు దక్కనున్న 388 మెడికల్ పిజి సీట్లు…
2025-26 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణలో 31 పిజి మెడికల్ కాలేజీలు 2,983 సీట్లను అందిస్తున్నాయి, వీటిలో 12 ప్రభుత్వ (1,472 సీట్లు), 19 ప్రైవేట్ కాలేజీలు (1,511 సీట్లు) ఉన్నాయి. ప్రభుత్వ కాలేజీలలో 50 శాతం సీట్లు ఆలిండియా కోటా కింద, 50 శాతం సీట్లు స్టేట్ కోటా పరిధిలోకి వస్తాయి. ప్రైవేట్ కాలేజీలలో 50 శాతం స్టేట్ కోటా పరిధిలోకి, మిగిలిన 50 శాతం మేనేజ్‌మెంట్ కోటా కిందకు వస్తాయి. 741 పిజి మెడికల్ మేనేజ్‌మెంట్ కోటా సీట్లలో 374 సీట్లు మేనేజ్‌మెంట్ కోటా-కు చెందినవి. ప్రభుత్వం సవరించిన కొత్త విధానం ప్రకారం 318 సీట్లు (85 శాతం) ఇప్పుడు తెలంగాణ స్థానికత ఉన్న అభ్యర్థులకు రిజర్వ్ చేయబడతాయి. 56 సీట్లు (15 శాతం) ఆలిండియా కోటా కింద భర్తీ చేస్తారు. అలాగే 70 డెంటల్ పీజీ సీట్లు కూడా మన విద్యార్థులకే దక్కుతాయి. మొత్తంగా పిజి మెడికల్, పిజి డెంటల్ కలిపి తెలంగాణ స్థానికత ఉన్న విద్యార్థులకు 388 సీట్లు అదనంగా లభించనున్నాయి.
చారిత్రక నిర్ణయం తీసుకున్న సిఎంకు కృతజ్ఞతలు : మంత్రి దామోదర్ రాజనర్సింహ
మెడికల్ పీజీ మేనేజ్‌మెంట్ కోటాలో 85 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకు కేటాయిస్తూ చారిత్రక నిర్ణయం తీసుకున్న సిఎం రేవంత్‌రెడ్డికి ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కృతజ్ఞతలు తెలిపారు. పిజి సీట్ల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది ఎంబిబిఎస్ డాక్టర్లకు ఈ నిర్ణయం ఎంతో మేలు చేస్తుందన్నారు. ఎంబిబిఎస్ సీట్లతో పోలిస్తే, పిజి సీట్లు తక్కువగా ఉండడం వల్ల పిజి సీట్ల కోసం పోటీ ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. ఇన్నాళ్లు మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీలో తెలంగాణ విద్యార్థులకు కోటా లేకపోవడంతో, ఇతర రాష్ట్రాల విద్యార్థులు వచ్చి మన దగ్గర పిజి చేస్తున్నారని మంత్రి తెలిపారు. మన డాక్టర్ల విజ్ఞప్తి మేరకు సీట్ల భర్తీ నిబంధనల్లో మార్పులు చేశామని చెప్పారు. ఇకపై మేనేజ్‌మెంట్ కోటాలో 85 శాతం సీట్లు, కన్వీనర్ కోటాలో వంద శాతం సీట్లు మన రాష్ట్ర విద్యార్థులకే దక్కుతాయని మంత్రి వివరించారు. దీంతో రాష్ట్రంలో స్పెషలిస్ట్ డాక్టర్ల సంఖ్య పెరుగుతుందని, తద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుతాయని అన్నారు. డాక్టర్లకు, ప్రజలకు మేలు చేకూరేలా చారిత్రక నిర్ణయం తీసుకున్న సిఎం రేవంత్‌రెడ్డికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.