భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పట్టణంలోని బీఆర్ఎస్ ఆఫీసును ముట్టడించి ఫర్నీచర్ ను తగులబెట్టారు. బీఆర్ఎస్ ఆఫీసుపై కాంగ్రెస్ జెండాను ఎగురవేసి తమ పార్టీ కార్యాలయాన్ని తాము తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచి, బీఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే. అప్పట్లో మణుగూరులోని కాంగ్రెస్ ఆఫీసును బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా మార్చారు.