హైదరాబాద్: నల్గొండ జిల్లా నకిరేకల్ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకరు మృతి చెందారు. నకిరేకల్ శివారులో 365వ నంబర్ హైవేపై బైకును ఢీకొట్టి కారు బోల్తా పడింది. ఈ ఘటనలోకారు ఢీకొనడంతో బైకుపై ప్రయాణిస్తుండగా ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు మిర్యాలగూడకు చెందిన సంధ్య గా పోలీసులు గుర్తించారు.