హైదరాబాద్: భద్రాద్రి జిల్లా మిణుగురులో బిఆర్ఎస్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. బిఆర్ఎస్ కార్యాలయం ఆవరణలో ఫ్లెక్సిలు చింపేశారు. ప్రభుత్వ స్థలంలో బిఆర్ఎస్ కార్యాలయం నిర్మించాలని కాంగ్రెస్ ఆరోపణలు చేశారు. గతంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే రేగ కాంతారావు కాంగ్రెస్ కార్యాలయాన్ని ఆక్రమించారనే ఆగ్రహంతో, తాజాగా కాంగ్రెస్ శ్రేణులు ప్రతీకారం తీర్చుకున్నారు. బిఆర్ఎస్ కార్యాలయంలోకి కాంగ్రెస్ నాయకులు దూసుకెళ్లి ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి, పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఈ దాడిలో స్వల్ప ఘర్షణ చోటుచేసుకుని పలువురికి గాయాలయ్యాయి.