వన్డే ప్రపంచ కప్ 2025 ఫైనల్‌లో భారత అమ్మాయిలు అదరగొట్టారు. సౌతాఫ్రికాతో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా.. సౌతాఫ్రికాకు 299 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఓపెనర్లు షెఫాలీ వర్మ(87), దీప్తీ శర్మ(58 నాటౌట్)లు అర్థ శతకాలతో మెరిశారు. స్మృతి మంధాన (45), రిచా ఘోష్ (34)లు రాణించారు. అయితే, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (20), జెమీమా రోడ్రిగ్స్(24)లు భారీ స్కోరు చేయడంలో విఫలమయ్యారు. దీంతో భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 298 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో అయబొంగా ఖాకా 3 వికెట్లు పడగొట్టగా.. మ్లాబా, క్లో ట్రయాన్, నడిన్ డి క్లెర్క్ లు తలో వికెట్ తీశారు.