మన తెలంగాణ / హైదరాబాద్ : సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో వ్యవసాయ కళాశాల నిర్మాణానికి సేకరించడానికి ఉద్దేశింపబడిన భూములకు ఎకరాకు రూ. 30 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు రైతు సంఘం నేతలు పశ్య పద్మ, కె. సూర్యనారాయణ, కంబాల శ్రీనివాస్, ఎం.ప్రభులింగం, డిజి నరేందర్ ప్రసాద్‌హలు ఆదిఆరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తరతరాలుగా సాగు చేసుకుంటూ రావుడీ పట్టాలు పొందిన నిరుపేద రైతులు, ఇతరుల నుండి కొనుగోలు చేసుకున్న రైతులు సాగు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారని, ఆడపిల్లల పెళ్లి సందర్భంగా ఈ భూములనే వారికి ఇవ్వడం జరిగిందని మంత్రికి వివరించారు. . కుటుంబాలలో ఘర్షణలు జరిగే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ కళాశాలకు భూ సేకరణ కోసం అధికారులు రైతులతో మాట్లాడిన నాటి నుంచి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘంతో బాధిత రైతులు సంప్రదిస్తున్నారు. వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు మేము వ్యతిరేకం కాదని, రైతులు కోరిన విధంగా నష్టపరిహారం న్యాయబద్ధంగా ఉంటే బాగుంటుందని తెలిపారు.
ప్రభుత్వం ప్రకటించిన ఎకరాకు 22 లక్షల రూపాయలు తిరిగి రైతులు కొద్దిమేర కైనా భూమిని కొనుగోలు చేసుకో లేని పరిస్థితి నెలకొందని, ఎకరాకు రూ. 30 లక్షలు ఇవ్వాలని రైతు నాయకులు కోరారు. మొదటినుండి రైతులు కోరుతున్నట్లు మాకు తెలియజేశారు. భూమిని కోల్పోతున్నప్రతి రైతుకు ఇందిరమ్మ ఇల్లు, కుటుంబంలో ఒకరికైనా ఉద్యోగవసతి ఏర్పాటు చేయడం ద్వారా రైతుల ను ఆదుకోవాలని కోరారు. భూములను కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం తో పాటు పునరావాసాన్ని కల్పించాలని కోరుతున్నాం. రైతుల పొలాల్లో లక్షల రూపాయల ఖర్చుతో త్రవ్విన బావులు, వేసుకున్న బోర్లు గొడ్డు గోదా లను పరిగణలోకి తీసుకోవలని కోరుతున్నాం.