ఈ ఆదివారం టీం ఇండియా క్రికెట్ అభిమానులకు పండుగ కానుంది. ఎందుకంటే భారత్ పురుషుల జట్టు, మహిళల జట్టు రెండు కీలక మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఐదు టీ-20ల సిరీస్‌లో భారత్, ఆదివారం ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇప్పటికే ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా.. రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. దీంతో నేడు జరిగే మ్యాచ్‌లో గెలిచి సిరీస్ సమం చేయాలని సూర్యకుమార్ సేన భావిస్తోంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1.45 గంటలకు ప్రారంభంఅువ
మరోవైపు.. భారత మహిళల జట్టు నేడు అత్యంత కీలకమైన మ్యాచ్ ఆడనుంది. ఐసిసి వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఫైనల్స్‌లో సౌతాఫ్రికా మహిళలతో హర్మన్ సేన తలపడనుంది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించిన భారత మహిళలు ఫైనల్ మ్యాచ్‌లో ఆడేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్రపంచకప్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు. మరోవైపు సౌతాఫ్రికా జట్టు కూడా బలంగానే ఉంది. దీంతో ఫైనల్‌లో భారత్‌కు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభకానుంది.
ఇక ప్రపంచకప్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన జట్టుకు 4.48 మిలియన్ యూఎస్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 39.78 కోట్లు) ఇవ్వనుంది. ఇక రన్నర్‌అప్ జట్టుకు విజేతకు ఇచ్చిన దాంట్లో సగం అంటే.. 2.24 మిలియన్ యూఎస్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.19 కోట్లకు పైగా ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు. ఇక హర్మన్‌సేన ఫైనల్‌లో గెలిస్తే.. బిసిసిఐ కూడా భారీ నజరానా ప్రకటించింది. ట్రోఫీ గెలిస్తే జట్టుకు రూ.125 కోట్ల ఇవ్వనుందనే వార్త ప్రచారంలో ఉంది.