బీజాపూర్ జిల్లాలోని చిల్కాపూర్ గ్రామానికి దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏండ్లు అయినా కరెంటు లేదు. బడి లేదు. ఇప్పుడు ఇక్కడ ఈ రెండూ నెలకొన్నాయి. రెకావాయా గ్రామంలో తొలిసారిగా బడిగంట మోగిందని ఇంతకంటే మంచి ఏముంటుందని ప్రశ్నించారు. ఇంతకు ముందు వరకూ నక్సల్స్ కోటగా నిలిచిన పువర్తి గ్రామంలో ఎర్రజెండాలే కనబడేవి. ఇప్పుడు పరిస్థితి మారింది. అక్కడ సగర్వంగా మువన్నెల భారతీయ జెండాలు రెపరెపలాడుతున్నాయని , మార్పు అంటే ఇదే అని ప్రధాని తెలిపారు. ఇక ఓ వైపు నక్సలిజం తీవ్ర సమస్యతో పలు అడ్డంకులు ఉన్నా, ఈ రాష్ట్రం పాతికేళ్లలో ముందకు సాగింది. ఇప్పుడు నక్సలిజం బెడద పోనుండటంతో ఇకపై ప్రగతి పథంలో మరింత వేగంగా సాగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.