‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘కూలీ’, ‘లియో’ ఈ సినిమాల సృష్టికర్త.. డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్.. ఇప్పుడు హీరోగా మారిపోయాడు. చాలా రోజులుగా లోకేశ్ హీరో అవుతాడని టాక్ వినిపించింది. అయితే అది కేవలం రూమర్ మాత్రమే అని అంతా భావించారు. కానీ, ఇప్పుడు అధికారికంగా లోకేశ్‌ను హీరోగా ప్రకటించారు. లోకేశ్ హీరోగా నటిస్తున్న చిత్రానికి ‘డిసి’ అనే టైటిల్‌ని పెట్టారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ వామికా గబ్బి హీరోయిన్‌గా నటిస్తుండగా.. అరుణ్ మాతేశ్వరన్ దర్శకుడు. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టైటిల్ టీజర్‌ని విడుదల చేశారు.
ఈ టైటిల్ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దేవదాస్ (లోకేశ్ కనగరాజ్) ఒళ్లంతా రక్తంతో చేతిలో కత్తితో నడుచుకుంటూ వస్తుండగా.. మరోవైపు చంద్ర(వామికా గబ్బి) కండోమ్ తీసుకుని ఓ గదిలోకి వస్తుంది. ఈ టీజర్‌లో విజువల్స్ కానీ, అనిరుధ్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కానీ బాగున్నాయి. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు కూడా ప్రకటించారు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. మరి డైరెక్టర్‌గా సక్సెస్ సాధించి లోకేశ్.. నటుడిగా ఏ మేరకు మెప్పిస్తాడో చూడాలి.?