హీరో శర్వానంద్ గత కొంతకాలంగా మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. గత ఏడాది ‘మనమే’ అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. కానీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. కాగా, శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘బైకర్’. స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం రూపొందింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ని రివీల్ చేస్తూ.. ఓ గ్లింప్స్‌ని ‘ఫస్ట్ లాప్’ పేరుతో విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘ఇక్కడ ప్రతి బైకర్‌కి ఓ కథ ఉంటుంది’ అనే డైలాగ్‌తో ఈ గ్లింప్స్ ప్రారంభమవుతుంది. ఈ చిత్రం బైక్ రేసు చుట్టు తిరుగుతుందని ఈ గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది. చివర్లో ‘గెలవడం గొప్ప కాదు.. చివరి దాక పోరాడటం గొప్ప’ అనే డైలాగ్‌తో ఈ టీజర్ ముగుస్తుంది. చివర్లో డిసెంబర్ 6న ఈ సినిమా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
యువి క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను వంశీ కృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. డా.రాజశేఖర్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుండగా.. మాళవిక నాయర్ హీరోయిన్ పాత్ర పోషిస్తుంది. గిబ్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.