హైదరాబాద్: టి20లో పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ బాబర్ అజమ్ రికార్డు సృష్టించాడు. టీమిండియా బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ రికార్డును బాబర్ తన ఖాతాలో వేసుకున్నాడు. దక్షిణాఫ్రికా-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో బాబర్ 11 పరుగులు చేసి టి20లో అత్యధిక పరుగులు చేసి బ్యాట్స్‌మెన్‌గా చరిత్ర సృష్టించాడు. బాబర్ 123 ఇన్నింగ్స్‌లలో 39.37 సగటుతో 4234 పరుగులు చేశాడు. గతంలో రోహిత్ శర్మ 159 మ్యాచ్‌ల్లో 4231 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ 125 మ్యాచ్‌లలో 4188 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. రోహిత్, విరాట్ టి20లకు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. టి20ల్లో నంబర్ వన్ స్థానంలో అభిషేక్ శర్మ ఇదే ఫామ్ కొనసాగిస్తే బాబర్ రికార్డు గల్లంతు కావడం ఖాయమని క్రికెట్ పండితులు చెబుతున్నారు.